![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్ 7 ఈ నెల 3 నుంచి ప్రారంభం కాబోతోంది. "మా హౌస్‌లో మాత్రమే కాదు.. మీ హౌస్‌లో కూడా" అంటూ బిగ్ బాస్ బజ్ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన ప్రోమోను రిలీజ్ చేసింది స్టార్ మా. ఆదివారం సాయత్రం 7 గం. స్టార్ మాలో కర్టెన్ రైజర్ ఉండబోతోంది. ఇక ప్రతీ శని, ఆదివారాల్లో రాత్రి 9గంటలకు ఈ షో ప్రసారం కానుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 9.30 గంటలకు ప్రసారం చేయనున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో 24 గంటలూ ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు. వీకెండ్స్ లో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి లేటెస్ట్ అప్ డేట్స్ ని హౌస్ మేట్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇందులో కొన్ని చేంజెస్ చేశారు.
ఈ శని, ఆదివారాల్లో వచ్చే వీకెండ్ ఎపిసోడ్‌ని సెట్‌కి వెళ్లి లైవ్‌లో చూసే అవకాశాన్ని కల్పిస్తోంది స్టార్ మా. ప్రతిరోజు ‘బిగ్ బాస్ బజ్ " లో అడిగే ప్రశ్నలకు ఫేస్ బుక్ లైవ్‌లో కరెక్ట్‌గా ఆన్సర్ చేస్తే లక్కీ విన్నర్‌ని వీకెండ్ ఎపిసోడ్‌కి ఆడియన్స్ గా పంపించే సదవకాశం అందిస్తోంది. ఇక బిగ్ బాస్ బజ్ యాంకర్ గీతూ... ఇక ఈ బిగ్ బాస్ బజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే.. సెప్టెంబర్ 4 ఉదయం 10 గంటలకు.. తిరిగి సాయంత్రం 6 గంటలకు. ఇంకెందుకు ఆలస్యం.. బిగ్ బాస్ సెట్‌కి వెళ్లి.. లైవ్‌లో షో చూడాలనుకునే, నాగార్జునతో ముచ్చటించాలనుకునే ఆసక్తి ఉన్న ఆడియన్స్ ట్రై చేయండి మరి. బిగ్ బాస్ ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా ఉంటుందంటూ మంచి హైప్ క్రియేట్ చేశారు నాగార్జున. సరికొత్త రూల్స్, టాస్క్‌లతో మరింత ఆసక్తికరంగా ఎవరూ ఊహించిన రీతిలో ఉంటుందని చెప్పడంతో ఆడియన్స్ మాత్రం ఎప్పుడెప్పుడు షో వస్తుందా ఆ రూల్స్ ఏమిటా ఆ హౌస్ మేట్స్ ఎవరా అని తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఆదివారం సాయంత్రం స్టార్ మా హయ్యెస్ట్ రేటింగ్ ని అందుకోబోతోంది అనే విషయం తెలుస్తోంది.
![]() |
![]() |